CM Revanth Reddy: వివిధ దేశాల ప్రతినిధులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్లో 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆతిథ్యం ఇచ్చారు.
అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్లైనర్’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దృష్టి డ్రోన్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని హరి కుమార్ వివరించారు. దృష్టి 10 ‘స్టార్లైనర్’ అనేది ఒక అధునాతన…
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
BCCI Annual Awards 2024 in Hyderabad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనుంది. జనవరి 23న హైదరాబాద్లో బీసీసీఐ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్…
టీవీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. బస్సులో పరిచయం అయిన మేకప్ ఆర్టిస్ట్ ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ నమ్మించాడు. డెమో కోసం అంటూ యూసుఫ్ గూడా లోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశాడు.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని ప్లాట్ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో యాభై మందికి గాయాలు కావడంతో పాటు ఒకరు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది.
Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు.
Faith In Astrology: కొంతమందికి జ్యోతిష్యం అంటే పిచ్చిగా నమ్ముతారు. అలా నమ్మేవారికి నక్షత్రాలు, తిధులు, గ్రహాలు వంటి ప్రతిదానిపై వారికి విశ్వాసం ఎక్కువగానే ఉంటుంది.