Lover Kidnap: హైదరాబాద్ ఘట్కేసర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. చెల్లిని ప్రేమించాడని అన్న ప్రేమికుడిని కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పోరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు.
Hyderabad National Book Fair 2024: ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన (నేషనల్ బుక్ ఫెయిర్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ జాతీయ పుస్తక ప్రదర్శన.. 36వ ఎడిషన్‌తో ఈ ఏడాది కూడా మన ముందుకొచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు పది రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుంది. ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. యూసుఫ్ గూడలోని లక్ష్మీనరసింహనగర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు.
హైదరాబాద్ నగరంలో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నగరంలో పలు చోట్ల కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. నేటి తెల్లవారుజాము నుంచే సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
Hyderabad Student Attacked By Four Men In Chicago: అమెరికాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. హైదరాబాద్ లంగర్‌హౌజ్ హషీమ్‌నగర్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై చికాగోలో దాడి జరిగింది. హోటల్ నుంచి ఇంటికెళ్తున్న మజాహిర్ అలీపై నలుగురు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో అతడి తల, ముక్కు, కళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన గత శనివారం (ఫిబ్రవరి 4) చికాగోలోని క్యాంప్‌బెల్ ఏవ్‌లో జరిగింది. హైదరాబాద్ విద్యార్థి సయ్యద్…