Flat Sizes: దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు మంచి గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా లగ్జరీ ఫ్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భారతదేశంలోని టాప్-7 నగరాల్లో సగటున ‘ఫ్లాట్ సైజ్’ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్, కోల్కతా రెండు నగరాల్లోనే ఫ్లాట్ సైజ్ తగ్గింది.
ఇప్పటి వరకు రేషన్ కార్డు ఈ-కేవైసీ చేసుకోని వారికి గుడ్న్యూస్ చెబుతూ.. మరో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా.. ముందుగా విధించిన గడువు ప్రకారం జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చు అని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఆస్తులపై కొనసాగుతున్న విచారణ కొనసాగుతుంది. హెచ్ఎండీఏలో సంవత్సర కాలంగా బాలకృష్ణ అనుమతులపై విచారణ కొనసాగుతుంది. ఇక, బాలకృష్ణకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా ఎంక్వైరీ కొనసాగుతుంది.
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి.
రేపు జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్బంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధం అవుతున్నారు.. మరోవైపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్లు మూసివేయనున్నారు. జనవరి 26 వైన్ షాపు బంద్ అనే బోర్డులు మద్యం షాపుల ఎదుట దర్శనం ఇవ్వటంతో ఈరోజు సాయంత్రం నుంచే మందుబాబులు వైన్ షాపుల ముందు జనాలు క్యూ కడుతున్నారు.. హైదరాబాద్ సిటీలో వైన్ షాపుల దగ్గర రద్దీ నెలకొంది. పబ్లిక్…