గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ ముద్దుబిడ్డ గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. 50ఏళ్ల క్రితం విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య ప్రారంభమైన రాకపోకలు నిరంతరాయంగా కొనసాగిస్తోంది గోదావరి ఎక్స్‌ప్రెస్.
ఝార్ఖండ్‌లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తబోతుందా? రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? లేదంటే అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కమలం వ్యూహం పన్నుతుందా? రాజ్‌భవన్ కేంద్రంగా అసలేం జరుగుతోంది.
Houseful occupancies for Movie Primeiers in Hyderabad: ఈ మధ్యకాలంలో సినిమా చిన్నదైనా, పెద్దదైనా కంటెంట్ మీద నమ్మకం ఉంటే కనుక ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న ట్రెండు బాగా పెరిగింది. చాలా చిన్న సినిమాలకు ఈ ప్రీమియర్స్ బాగా కలిసి వచ్చాయి కూడా. దాదాపు రైటర్ పద్మభూషణ్, సామజవరగమన ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాలకి ఈ పైడ్ ప్రీమియర్స్ ట్రెండ్ అద్భుతంగా కుదిరింది. అయితే ఈ సినిమాల ప్రీమియర్స్ వేసినప్పుడు ఆ సినిమా…
KCR: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
Hyderabad: హైదరాబాద్ మహానగరం గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌కు ఎక్కడెక్కడి నుంచో ఉపాధి కోసం చాలా మంది వస్తుంటారు. అలాగే చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ జయంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డుగా మారుస్తామని ఆయన ప్రకటించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళనకు దిగింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ తగాదా విషయంలో తప్పుడు ఎంఎల్సీ సర్టిఫికేట్ సృష్టించి రిమాండ్ కు తరలించేందుకు మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది.
నిబద్దతతో సమర్థవంతంగా డ్యూ చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు దిగే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
జేఏ యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఏపీ సీఐడీ అధికారులమంటూ కంపెనీలోకి పది మంది వెళ్లినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను నకిలీ ఏపీ సిఐడి అధికారులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు అయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్స్ ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు.