Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసు.. అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radisson Drugs Case: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరి సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా.. మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ పేర్లను పోలీసులు చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తెలిపాడు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన, డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్ పార్టీ లో శ్వేత ,లిసి ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నరని అన్నారు.
Read also: Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తి గత డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపాడు. వివేక్ ఆదేశాలు మేరకు 2 గ్రాముల కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేసినట్లు వెల్లడించాడు. రెండు గ్రాముల కొకైన్ ను సయ్యద్ అలీ కి డ్రైవర్ ప్రవీణ్ 32000 గూగుల్ పే ద్వారా చెల్లించాడని, ఈ నెల 24 తేదీన మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, సందీప్,శ్వేత ,లిసి ,నిల్ ,డైరెక్టర్ క్రిష్ తో డ్రగ్ పార్టీ చేసుకున్నారని తెలిపాడు. పేపర్ రోల్‌ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ 3 గ్రాముల కొకైన్ సేవించారన్నాడు. రాడిసన్ హోటల్లోని 1200 & 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించారని తెలిపాడు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ ఛాటింగ్ ను పోలీసులు గుర్తించారు.
TS DSC Notification: నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్..! 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!