IPL2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్లో ఇవాళ (బుధవారం) సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరగబోతుంది. ఇక, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు ఇరు జట్లు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 8పరుగులు తేడాతో ఓడిపోగా… ఇక ముంబై గుజరాత్ టైటాన్స్ చేతిలో 6పరుగులు తేడాతో ఓటమిపాలయ్యింది.. చాలా రోజుల తర్వాత ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండడంతో…
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు భగభగ మంటు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అవుతున్నాయి.
ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నేటి సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
Cannabis in Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. రూ.11 లక్షల విలువ చేసే 30 కేజీల గంజాయి సీజ్ చేసింది.
Gareth Wynn Owen Meets Hero Nani: తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషర్గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్.. టాలీవుడ్ హీరో నానిని కలిశారు. హైదరాబాద్లో నాని నివాసానికి వెళ్లిన గారెత్.. మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ తెలిపారు. ‘ నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. నాని సినీ, వ్యక్తిగత జీవితం గురించి…
Drug Network: తెలంగాణ క్రమక్రమంగా డ్రగ్స్కు అడ్డాగా మారుతోంది. పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పోలీసులు ఛేదించారు.
D. Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన చికిత్స అందించడానికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ ప్రత్యేక నంబర్తో అనుసంధానించబడుతుంది.