ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి బాగానే జరుగుతుంది. తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ ప్రజలను వారిపైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హైదరాబాదులోని మెట్రో రైల్ లో ప్రయాణించి హల్చల్ చేశారు. నిజానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉంటుందన్న సంగతి మనకి తెలిసిందే. తనదైన తెలంగాణ యాసతో, జోకులు వేస్తూ ఆటపాటలతో ఆయన ఉన్న ప్రదేశాన్ని బాగా ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు.
ఇకపోతే గురువారంనాడు మల్కాజ్ గిరి టిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఆయన మెట్రో రైల్లో ప్రయాణం చేసి వార్తల్లోకి ఎక్కారు. ఇక మెట్రో రైల్లో ఓటర్లను హుషారుగా దగ్గరికి తీసుకుంటూ బిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఇక ఈ ప్రయాణంలో మెట్రో ప్రయాణికులు ఎమ్మెల్యే మల్లారెడ్డి తో సెల్ఫీలు దిగేందుకు తెగ ఆసక్తి చూపారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.