Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు శుభవార్త అందించారు. రేపు (25న) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది.
Read also: Samantha : సోషల్ మీడియాపై సమంత సంచలన వ్యాఖ్యలు..
ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. ఆ రోజు మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు మధ్యాహ్నం 12:15 గంటలకు బయలుదేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Read also: Sita Kalyana Vaibhogame: గ్రాండ్ గా ‘సీతా కళ్యాణ వైభోగమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇక మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీ దృష్ట్యా గురువారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ బస్సులు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు ఏర్పాటు చేయనున్నారు.
Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్!