TSRTC: సమ్మర్ సీజన్ మొదలైంది. అటు కాలేజీలకు ఇటు స్కూల్స్ కు సెలవు ప్రకటించడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంటారు. పుణ్యక్షేత్రాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది తిరుపతి, శ్రేశైలం. ఇక తిరుపతితో పాటు చాలా మంది శ్రీశైలం కి కూడా ఈ సమ్మర్ లో వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. అంతేకాదు.. అసలే సమ్మర్ సీజన్ కావడంతో అంతదూరం ప్రయాణం చేయాలంటే నార్మల్ బస్సులో జర్నీ చేయాలంటే ఈ ఎండకు ప్రాణం పోయినంత పని అవుంతుంది. ఎండలకు తట్టుకుని ఆవేడికి నార్మల్ బస్సులో ప్రయాణం అంటే నిప్పులమీద కూర్చొని వెళుతున్నట్లు అనిపిస్తుంది.
Read also: Pocso Act : పోక్సో చట్టం కింద పెరిగిన తప్పుడు కేసులు.. ఆందోళన వ్యక్తం చేసిన ఒరిస్సా హైకోర్టు
ఇక వయస్సు ఎక్కువగా వున్నవాళ్లు నార్మల్ బస్సుల్లో జర్నీ అంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయినా కూడా ఇబ్బందులు పడుతూనే ఉక్కపోతతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న టీఎస్ ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీశైలంకి వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ.. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం కు ప్రతి గంటకోసారి ఏసీ బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏసీ బస్సులు నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటికే సికింద్రాబాద్ ప్రాంతంలోని జేబీఎస్ నుంచి ఈ ఏసీ బస్సులు నడుస్తున్నాయి.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అంతేకాకుండా.. బస్సు చార్జీలు కూడా నిర్ణయించింది. ఏసీ బస్సుల్లో సికింద్రబాద్ నుంచి శ్రీశైలంకి రూ.524గా ఛార్జీలను నిర్ణయించగా.. బీహెచ్ఈఎల్ నుంచి కూడా ఈ ఏసీ బస్సులు నడవనున్నాయని తెలిపింది. అయితే.. బీహెచ్ఎల్ నుంచి రూ.564 టికెట్ ధరను నిర్ణయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా.. అత్యాధునిక సౌకర్యాలతో, ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా ఆర్టీసీ సంస్థ తయారు చేయించింది. ఈ.. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సుల్లో ప్రయాణించి హాయిగా శ్రీశైలం చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. టీఎస్‌ఆర్టీసీ ఏసీ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ తెలిపింది. ఇందులో ముందస్తు రిజర్వేషన్ కోసం టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ ని సంప్రదించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Israel-Hamas War: “నన్ను పెళ్లి చేసుకుని, నా బిడ్డలకు తల్లిగా ఉండు”.. ఇజ్రాయిల్ యువతికి హమాస్ ఉగ్రవాది ప్రపోజల్..