Konda Lakshma Reddy: మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Lakshma Reddy: కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నింపుతూ.. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
IND vs AUS: వన్డే చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్.. టాప్ 5లో నాలుగు రికార్డులు ఆస్ట్రేలియావే!
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేగా సుపరిచితులైన కొండా లక్ష్మారెడ్డి, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స ఫలించక మరణించారు. జర్నలిజంపై ఆయనకున్న మక్కువతో 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను స్థాపించారు. జర్నలిస్ట్ హక్కుల కోసం కృషి చేసిన ఆయన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడైన కొండా లక్ష్మారెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి ఛైర్మన్‌గా పలు కీలక పదవులను నిర్వహించారు.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!