హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బౌన్సర్ల తో పాటు మోహన్ బాబు, విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు…
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?..
ప్రముఖ నటుడు మంచు మనోజ్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ఆస్పత్రిలో చేరారు. జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం భార్యతో కలిసి మంచు మనోజ్ వచ్చినట్లు తెలిసింది. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు మనోజ్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
BRS Leaders House Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు.
డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన 24 సంవత్సరాల లీలా కృష్ణ అనే యువకుడు.. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన లీలా కృష్ణ గురువారం నాలుగోసారి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టీ ఎఫ్ సీఐ నాగరాజు…
TG High Court: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహెల్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఈ నెల 16వ తేదీన పంజాగుట్ట పోలీసుల ముందు సాహెల్ హాజరు కావాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
TG Police Dept: హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్లో ట్రాన్స్ జెండర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలెక్షన్స్ జరిగాయి. గోశామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్స్ కి ఈవెంట్స్ నిర్వహించిన అధికారులు.. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు.
Google- Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. భాగ్యనగరంలో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది.