హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్న కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
Missing Case: హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికల మిస్సింగ్ ఘటన సుఖాంతం అయ్యింది. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల సూర్యలంక బీచ్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
Oasis Fertility: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ లో హెల్త్ కేర్ రంగంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్హులైన 10 మంది పిల్లలకు ముఖ్య అతిధి రమ్యకృష్ణ స్కాలర్ షిప్ సర్టిఫికెట్లను అందజేసింది.
Traffic Alert: హైదరాబాద్ ప్రజలకు నగర ట్రాఫిక్ అధికారులు అలర్ట్ చేశారు. నేడు, రేపు (21,22) ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు, శుక్రవారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని..
హైదరాబాద్లో జరుగుతున్న 'భక్తి టీవీ' కోటి దీపోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రాబోతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్లో సేవాదళ్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. సేవాదల్ అధ్యక్షులు జితేందర్ అధ్యక్షతన ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సేవాదళ్ అధ్యక్షులు లాల్జ్ జి దేశాయ్, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో పలుచోట్ల హోటల్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. నగరంలో ఫుడ్ కల్తీ ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, అమీర్ పేట్లోని ఉత్తరాస్ టిఫిన్స్, అయితే బిర్యానీ, టిబ్బ్స్ ప్రాక్టీస్, కింగ్స్ ఆఫ్ కబాబ్స్తో పాటు మెహదీపట్నంలోని అబ్దుల్ బాయ్స్ హాస్టల్, మధురానగర్లోని యూనివర్సల్ ఆల్ మాతం మండి కబాబ్స్ అండ్ బిర్యానీ సెంటర్లలో అధికారులు తనిఖీలు చేశారు.