Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, ఈ రోజు (డిసెంబర్ 2) తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గోషామహల్ స్టేడియంలో నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి రహదారులపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ మహానగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శంషాబాద్ డిటిఎఫ్( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిలో కారు.. స్కూటర్‌ను ఢీకొట్టిన అనంతరం ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనంపై ప్రయాణిస్తున్న భార్యభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందిన ఘటన చర్లపల్లి డివిజన్లో జరిగింది.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. సమావేశంలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ప్రతిపాదనలపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించారు.
అవినీతి నిరోధక శాఖకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నికేష్‌కు చెందిన 33 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను గురించినట్లు సమాచారం.
డీప్ ఫేక్‌లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురారావాలని.. డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డేటా సైన్స్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, ఏఐ నిపుణులు నవంబర్…
హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థలు వరుసగా మూతపడుతున్నాయి. ఫ్రీ లాంచ్ ఆఫర్ ,బై బ్యాక్ పాలసీ పేర్లతో రియల్ ఎస్టేట్ కంపెనీలు నిండా ముంచుతున్నాయి. ఒక సైబరాబాద్‌లోనే 22 ఫ్రీ లాంచ్ ఆఫర్, 12 బై బ్యాక్ పాలసీ పేరుతో సంస్థలు మోసానికి పాల్పడ్డాయి.