హైదరాబాద్లోని పాతబస్తీ, మదన్నపేట, ఉప్పర్ గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా... అంత కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ... ఇప్పుడు మాత్రం మేటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం.
మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను తీసుకొస్తుంది. ఈ క్రమంలో మంత్రి సీతక్క రేపు సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్నారు. ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మంత్రి వాహనాలను ప్రారంభించనున్నారు.
Punishment For Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ యువకుడు, అతని స్నేహితురాలికి జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వెస్ట్మారేడుపల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే 27 ఏళ్ల తీగుళ్ల దయా సాయిరాజ్ (27), ఆయన స్నేహితురాలు గత నెల ఫిలింనగర్లో జరిగిన ఓ విందులో మద్యం తాగారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు, దయా…
Sewerage Overflow Free City : హైదరాబాద్ నగరంలో సీవరేజీ సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ నేటితో విజయవంతంగా ముగిసింది. గాంధీ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 90 రోజులుగా నిర్విరామంగా సాగిన ఈ డ్రైవ్ ద్వారా నగరంలోని 17,050 ప్రాంతాల్లో 2,200 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లను శుభ్రం చేశారు. ఈ చర్యల…
CMR College: హైదరాబాద్లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం…
Drunk Man: హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక మందుబాబులైతే బాగా చుక్కేసి చిందులు వేసినట్లు తెలుస్తోంది. ఐటీ కారిడార్లో మాత్రం ఆడా, మగా అనే తేడా లేకుండా ఫుల్లుగా మద్యం తాగి రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Food Safety Rides: హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో వివిధ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు జరుపగా, కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఉలవచారు, మల్నాడు కిచెన్, ట్రైన్ థీమ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన తర్వాత నిబంధనలను పూర్తిగా అనుసరించడం లేదని అధికారులు తెలిపారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, కొన్ని రెస్టారెంట్లలో కంట్రోల్డ్…
హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.