Hyderabad Rains: మొంథా తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో డతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కాగా, మలక్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలు పూర్తిగా నీటమునిగాయి. దిల్సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా అంతరాయమయ్యాయి. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్‌లు అక్కడికి చేరుకుని డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రం చేస్తూ నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యాయి. మన్‌హోల్స్ తెరిచి వరద…
Hyderabad: హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని జాహ్నవి గుప్తాగా పోలీసులు గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. జాహ్నవి ఇండిగో కెప్టెన్, మరో ఫ్రెండ్‌తో కలిసి పార్టీ చేసుకుంది. అనంతరం తన గదికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సహచరులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ నుంచి దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప. Also Read:…
Hyderabad's Reality Boom: హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం కరోనా ప్రభావం నుంచి గణనీయంగా కోలుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు (8 నెలల్లోనే) 22 వేల 680 కోట్ల రూపాయల విలువైన 46,078 రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు సేల్ అయ్యాయి. ఆగస్టు నెలలో 5,181 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు రిజిస్టర్ అయ్యాయి. జులై నెలతో పోల్చితే ఇది 20 శాతం ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. జులైలో ఆషాఢం వల్ల ఇళ్ల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లకు ప్రజలు పెద్దగా ఆసక్తి…
First Water School in Hyderabad: జలక్రీడలకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి వాటర్ స్కూల్‌ని హైదరాబాద్‌లో నిన్న ప్రారంభించింది. ఈ ఎక్స్‌క్లూజివ్ స్కూల్‌ని మాదాపూర్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మునిసిపల్ వ్యవహారాలు-పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆరంభించారు. సెయిలింగ్, కయాకింగ్, విండ్ సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్‌తోపాటు ఇతర జల అనుబంధ క్రీడలను ఇక్కడ నేర్పిస్తారు.
హైదరాబాదాలో కాల్పుల కలకలం రేపింది. ఈ కాల్పుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాయి.. ఈ ఘటన నగరంలోని మాధాపూర్ పోలీస్టేషన్ పరిధిలోని నీరూప్ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి బుల్లెట్…