హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో అపార్ట్మెంట్లో లిప్టు ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్‌ఎంపీ డాక్టర్ మృతిచెందాడు. బంతి లిఫ్ట్ గోతిలో పడడంతో తీసేందుకు ప్రయత్నించాడు అక్బర్ పాటిల్. అదే సమయంలో లిఫ్ట్ వెయిట్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
READ MORE: RR vs RCB: తడబడి నిలదొక్కుకున్న రాజస్థాన్ రాయల్స్.. హాఫ్ సెంచరీతో ఆదుకున్న జైస్వాల్
ఇదిలా ఉండగా.. ఇటీవల అలాంటి ఘటనే మరొకటి మెహదీపట్నంలో చోటు చేసుకుంది. ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 15న చోటు చేసుకుంది. దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్యామ్ బహదూర్ నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఏడు నెలల కిందట నగరానికి వచ్చాడు. ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్‌పక్కనే ఉన్న చిన్నగదిలో శ్యామ్ బహదూర్ కుటుంబం ఉంటోంది. రాత్రి 10 గంటల టైంలో.. సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిప్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. ఇది మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
READ MORE: Bengal Waqf Clashes: బెంగాల్‌లో బలపడుతున్న బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ.. ఇంటెల్ హెచ్చరిక..