టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అ సందర్భంగా ఆయన మీడయాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ స్థానికేతరుడని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని.. మరి హరీశ్‌రావుది సిద్ధిపేట కాదని, కేటీఆర్ ది సిరిసిల్ల కాదని.. వారు కూడా స్థానికేతరులనేని గుర్తు చేశారు. స్థానికేతరులైన కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రజలు అవకాశం ఇస్తే విర్రవీగుతున్నారన్నారు. అంతేకాకుండా 2009 ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న…
హుజురాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఇన్నాళ్లూ తమ కేడర్ ఓటు పడితే చాలు.. పరువు దక్కుతుందని భావించిన పార్టీ వర్గాలు.. ఇప్పుడు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నాయి? ఓటు బ్యాంక్‌తో పార్టీ నేతలకు వచ్చిన తంటా ఏంటి? లెట్స్ వాచ్..! కాంగ్రెస్‌కు వచ్చిన సమస్యపై నేతల్లో చర్చ..! హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార TRS.. బీజేపీ మధ్య ప్రచారం మొదలుకుని.. పాలిటిక్స్ వరకు పోటా పోటీగా నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీలు గెలుపుకోసం చేయని…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రహస్యంగా కలిశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వాళ్లిద్దరూ హైదరాబాద్ నగరంలోని గోల్కొండ హోటల్‌లో కలిశారన్న ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆరోపణలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. తాను పీసీసీ చీఫ్ రేవంత్‌ను కలిసిన మాట వాస్తవమే అని.. అయితే అది ఇప్పుడు కాదన్నారు. Read Also: మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి రాజాసింగ్…
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే చర్చ నడుస్తోంది. గడిచిన ఐదు నెలలుగా హుజూరాబాద్ లో రాజకీయ వేడిరాజుకుంటోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెరపడుతుండటంతో ఆయా పార్టీల ముఖ్య నేతలంతా కూడా హుజూరాబాద్ లోనే తిష్టవేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.…
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ‘చపాతీ రోలర్’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ చేరిందా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ కు మరో పదిరోజుల సమయం ఉండగా ప్రచారం మాత్రం 72గంటల ముందే ముగించాలని ఈసీ ఆదేశించింది. అంటే ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉందనే స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా హుజూరాబాద్ లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా సాగుతున్న ప్రచారంలోకి ఆయా పార్టీలకు చెందిన ముఖ్యనేతలు రంగంలోకి దిగుతున్నారు. దీంతో…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా సిద్ధమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవలే పూర్తి చేసుకున్న సంజయ్, ఇప్పటికే ఒకసారి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ప్రచార వ్యూహం రూపొందించారనీ… అందుకు అనుగుణంగా నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం మరింత ఉధృతం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి.…
రాజకీయంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ తీసుకొని గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. అయితే ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందనే టాక్ విన్పిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో హుజూరాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సైతం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆయా పార్టీల తరుఫున కీలక నేతలు…
తెలంగాణలోని హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీలని చెప్పుకునే సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు పార్టీల దుస్థితి చూస్తుంటే తెలంగాణలో ఈ పార్టీల భవిష్యత్ ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి.…
పచ్చటి సంసారంలో సైతం కేసీఆర్ చిచ్చు పెడతారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతుల్లో ఇక్కడ పుడితే టీఆర్ఎస్‌లోనే ఉండాలి అని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.. ఉద్యోగాలు పీకేస్తాం అని, పెన్షన్, కళ్యాణ లక్ష్మీ రాకుండా చేస్తామని అంటున్నారట.. ఆపడం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరించారు. వీటికి ఇచ్చే డబ్బులు…