హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్ పట్టుకుందా? ఇన్నాళ్లూ తమ కేడర్ ఓటు పడితే చాలు.. పరువు దక్కుతుందని భావించిన పార్టీ వర్గాలు.. ఇప్పుడు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నాయి? ఓటు బ్యాంక్‌తో పార్టీ నేతలకు వచ్చిన తంటా ఏంటి? లెట్స్ వాచ్..!
కాంగ్రెస్‌కు వచ్చిన సమస్యపై నేతల్లో చర్చ..!
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార TRS.. బీజేపీ మధ్య ప్రచారం మొదలుకుని.. పాలిటిక్స్ వరకు పోటా పోటీగా నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీలు గెలుపుకోసం చేయని ప్రయత్నాలు లేవు. గ్రామ, వార్డు స్థాయిలో ప్రభావితం చేసే నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. వారి అంతరంగం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సమస్య అంతా కాంగ్రెస్‌కే వచ్చి పడింది. ఆ సమస్యను తలుచుకునే పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట.
2018లో కాంగ్రెస్‌కు 62 వేల ఓట్లు వచ్చాయి..!
హుజురాబాద్‌లో గడిచిన ఎన్నికల్లో అభ్యర్థి బలాబలాల కంటే కాంగ్రెస్‌కు సగటున 35 నుంచి 40 వేల ఓటు బ్యాంక్ ఉంది. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో 62 వేల ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో ఎవరు ఉన్నా.. హస్తం గుర్తుకు ఢోకా ఉండేది కాదు. ఈ ఉపఎన్నిక మాత్రం ఆ ధీమా కల్పించలేకపోతోందట. కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్ వేసిన తర్వాత ప్రచారంలోకి వెళ్లేకొద్దీ గ్రౌండ్‌లో పరిస్థితి చూసిన నాయకులకు ఫీజులు ఎగిరిపోతున్నాయట.
కాంగ్రెస్ కేడర్‌కు టీఆర్ఎస్, బీజేపీలు వల..!
క్షేత్రస్థాయిలో ఈక్వేషన్లు మారిపోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ శిబిరాలు రెండు.. కాంగ్రెస్ కేడర్‌పై గురిపెట్టాయి. ఈ ఒక్క ఉపఎన్నికతో కాంగ్రెస్‌కు వచ్చే లాభం.. నష్టం ఏమీ లేదు కదా అని ప్రశ్నిస్తూ.. తాయిలాల వల విసుతున్నాయట. ఈ ట్రాప్‌లో చాలా మంది పడినట్టు కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. పోలింగ్ నాటికి మరికొందరు కూడా ఆకర్షణ వలకు చిక్కుతారని అనుకుంటున్నారట. సంప్రదాయ ఓటు బ్యాంకు ప్రలోభాలకు లొంగిపోతే.. ఉపఎన్నికలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది.
కాంగ్రెస్ నాయకత్వం ఆలస్యంగా రంగంలోకి దిగిందా?
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు వారం రోజులుగా కేడర్‌తో కలిసి ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఇక్కడే ఉంటే పార్టీ కేడర్‌కు కొంత నమ్మకం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కాకపోతే హుజురాబాద్ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఆలస్యంగా రంగంలోకి దిగిందనే అభిప్రాయం ఉంది. ఈ ఆలస్యం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నారట. 2018లో కాంగ్రెస్‌కు పడిన 62 వేల ఓట్లు మళ్లీ రాలేకపోయినా.. టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ పోరు మధ్య గౌరవ ప్రదమైన ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. మరి.. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో.. ఏ మేరకు ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటుందో నవంబర్ 2 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..