హుజూరాబాద్ లో పెరిగిన ఓటర్లు.. టెన్షన్లో నేతలు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ తీసుకొని గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. అయితే ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొందనే టాక్ విన్పిస్తోంది. ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో హుజూరాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ సైతం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆయా పార్టీల తరుఫున కీలక నేతలు రంగంలోకి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్న పార్టీలు పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిసారిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న హుజూరాబాద్ ఓటర్లను ఇక్కడి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదేవిధంగా పోస్టల్ ఓట్లపై ఆయా పార్టీల నేతలు నజర్ వేస్తున్నారు. హుజూరాబాద్ లో ఇప్పటి వరకు 822మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఈ ఓట్లన్నింటిని గంపగుత్తగా దక్కించుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయ్యేనాటికి హుజూరాబాద్ నియోజకవర్గంలో 2.36లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య మరో పదివేలకు పెరిగింది. ఇంత పెద్దమొత్తంలో కొత్త ఓటర్లు పెరిగిపోవడం అభ్యర్థుల్లో ఒకింత ఆందోళనను రేపుతోంది. కొత్తగా నమోదైన ఓటర్లు గెలుపొటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లు సైతం హుజూరాబాద్ లో ఓటరుగా నమోదు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు స్థానికేతరులైన ఓటర్లపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.
పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టిసారిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థానిక ఓటర్ల సమచారాన్ని సేకరిస్తున్నారు. వీరందరినీ సొంత ఖర్చుతో పోలింగ్ కేంద్రాలను తరలించేందుకు వారంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఉప ఎన్నికలో 80ఏళ్లు నిండిన వృద్ధులు, కోవిడ్ పేషంట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకునేలా ఈసీ అవకాశం కల్పించింది. దీనిని సద్వినియోగం చేసుకునేలా ఆయా పార్టీలు కసరత్తులు చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ ఉప ఎన్నిక మాత్రం నియోజకవర్గంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!