తండ్రి దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడు. దేశంలో శాంతి భద్రతలు లోపించకుండా.. అవినీతి, అక్రమాలు చెలరేగకుండా.. దేశంలో ప్రజలు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా దేశాభివృద్ధికి అహర్నిశలు కృషిచెయ్యాల్సినటువంటి బాధ్యతాయుత పదవిలో ఉన్నారు. ప్రజలు నేరాలకు, అక్రమాలకు పాల్పడకుండా చర్యలు చేపట్టే ఆ అధ్యక్షుడి కొడుకే నేరాలకు పాల్పడినట్లు ఆరోపించబడితే? ఆ ఆరోపణలు నిరూపించబడితే? ఆ అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అనుక్షణం అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తల పట్టుకునే పరిస్థితి దాపరిస్తుంది.…
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ తనపై నమోదైన రెండు కేసుల్లో నేరం అంగీకరించేందుకు ముందుకు వచ్చాడు. కాగా, ఆయనపై ఆదాయ పన్ను ఎగవేతతో పాటు అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ నేరాలను ఒప్పుకున్నారు.