ఆకలి వేస్తుంది అన్నం పెట్టండి అంటూ వేడుకుంటున్నా ఆతల్లికి కడుపున పిడికెడు అన్నం కూడా పెట్టకుండా నడిరోడ్డుపై వదిలేని వైనం తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒకవైపు మదర్స్ డే వేడుకలకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య,భూదేవి (58)అలియాస్ లక్ష్మి దంపతులు దిల్ సుక్ నగర్ న్యూ గడ్డి అన్నారం కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్…
ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే. ఎవరి దారి వారిది. ఉరుకుల పరుగుల జీవితం. అందునా నగర జీవనంలో పక్కవారి గురించి ఆలోచించే తీరిక, ఓపిక వుండదు. అసలే ఎండాకాలం. సూరీడు చుర్రుమంటున్నాడు. మామలుగా నడిచే వెళ్ళే వ్యక్తులు వడదెబ్బకు గురవుతున్నారు. రోడ్డపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది అతడి మానాన అతడిని వదిలేశారు. అతను అలాగే వుండిపోయాడు. కానీ కొందరు అలా కాదు. పక్కన…
సెలబ్రిటీలు ఏదో ఒక సామాజిక సేవ చేస్తూనే ఉంటారు. పేదల కోసం, పిల్లల కోసం తమకు తోచిన సాయం చేస్తూనే ఉంటారు. కొందరు ఉచితంగా వైద్యం అందిస్తుంటే..మరి కొందరు ఉచితంగా విద్య, ఆహారం కూడా అందిస్తుంటారు. రీల్ హీరోలు రియల్ హీరోలవడం అంటే ఇదే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆపదలో ఉన్న అనేకమందిని ఆదుకున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ హీరో కొందరు పేదలకు చేసిన సాయం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అతనెవరో…
అధికారం అంటే హంగు, ఆర్భాటం మాత్రమే కాదు. పదిమందికి సాయం చేయడం. ప్రమాదానికి గురైనవారికి తమవంతు సాయం చేసి ఆస్పత్రికి తరలించడం. గతంలో తమ అధినేత జగన్ చూపిన మానవత్వాన్ని ఆయన మంత్రులు కూడా చేసి చూపించారు. తన కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ ఆ అంబులెన్స్ దారి ఇచ్చి.. అందులో వున్న రోగుల్ని కాపాడారు. అదే బాటలో నడిచారు. కొత్తగా మంత్రులైన ఇద్దరు నేతలు. వారెవరో కాదు డిప్యూటీ సీఎం బూడి…
ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ళ నాని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయంతో రోడ్డు ప్రక్కన పడి ఉన్న బాధితుడిని ఆదుకున్నారు మంత్రి నాని. రోడ్ ఆక్సిడెంట్ లో విజయవాడ కొత్త బస్టాండ్ బెంజ్ సర్కిల్ మధ్యలో రోడ్ పక్కన పడి పోయాడు బాధితుడు శ్రీనివాస్ రెడ్డి. ఆ రూట్‌లో వెళుతున్న మంత్రి ఆళ్ళ నాని వెంటనే స్పందించారు. వెంటనే కారు దిగి క్షతగాత్రుడు దగ్గరికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్న ఆళ్ళ నాని…
ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…