నవరత్నాల పేరుతో ఎన్నో సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) కాకినాడ జిల్లా తునిలో మానవత్వం చాటుకున్నారు ముఖ్యమంత్రి జగన్. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డను గమనించిన ముఖ్యమంత్రి వెంటనే కాన్వాయ్ ఆపి వాహనం దిగారు సీఎం జగన్. వెంటనే సీఎం కాన్వాయ్ ఆగడంతో ఏం జరిగిందో అధికారులకు అర్థం కాలేదు.
బిడ్డ తల్లిని పిలిపించిన సీఎం … ఏం జరుగుతుందో ఆరాతీశారు. తునిలో తన పర్యటన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. జనాల మధ్య కుమారుడితో ఉన్న తల్లి తనూజను గుర్తించారు సీఎం జగన్. కుమారుడి ఆరోగ్య పరిస్ధితిని వివరించి ఆదుకోవాలని కోరింది ఆ తల్లి. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌కు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు సీఎం జగన్.
ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన తనూజ. సీఎం స్పందనతో సంతృప్తి వ్యక్తం చేసింది ఆ మాతృమూర్తి. గతంలోనూ తన పర్యటన సందర్భంగా అంబులెన్స్ కి దారి ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించకున్నారు. కాన్వాయ్ పక్కకు ఆపి అంబులెన్స్ (Ambulance) వెళ్ళాకే తన కాన్వాయ్ వెళ్ళనిచ్చారు జగన్.
Himanta Biswa Sarma: 800 ప్రభుత్వ మదర్సాల రద్దు.. టెర్రరిస్టులకు అడ్డాగా అస్సాం