China: విదేశీ అమ్మాయిలతో, అక్రమ వివాహాలకు దూరంగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం, చైనా పౌరులకు సూచించింది. ఆన్‌లైన్ మ్యాచ్ మేకింగ్ పథకాల పట్ల జాగ్రత్త వహించాలని కోరింది. చైనా ప్రభుత్వం మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘‘క్రాస్ బోర్డర్ డేటింగ్’’కి లొంగవద్దని చైనీయులను కోరింది.
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఈ ముఠాలో…
CP Sudheer Babu : రాచకొండ పోలీసులు చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి భారీ అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. అంతేకాకుండా, దత్తత తీసుకున్న 18 మంది పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా పిల్లల అక్రమ విక్రయాల్లో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుసంధానంలో ముఠాలో ప్రధానంగా అమూల్య అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు…
Human Trafficking : మన ఇంటి పక్కనే ఉంటున్న యువతులు ఏం చేస్తారో మనకు తెలియదు.. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ మనతో మాట మంతి కలుపుతారు.. అంతా బాగానే ఉంటుంది.. ఆఫీస్ టైం లో బయటికి వెళ్తారు.. తిరిగి ఇంటికి వస్తారు ..వాళ్ళు చేసే వ్యవహారం ఏంటో తెలియదు చాలామందికి.. ఇటీవల కాలంలో కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా తక్కువ అయిపోయింది.. ఇదే అక్రమార్కులకు ప్రధాన…
Human Trafficking In Bangladeshi Girls: బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో నమోదైన కేసులో ఆస్తులను అటాచ్ చేసింది.
ఉద్యోగాల కోసమని వెళ్లి థాయ్‌లాండ్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న వందలాది మంది భారతీయ యువతకు విముక్తి లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోక్యంతో వీరందరినీ స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మొత్తం 540 మంది బందీలను గుర్తించగా వీరిలో తెలంగాణ, ఏపీకి చెందిన 42 మందిని గుర్తించారు. వీరందరినీ 270 మంది చొప్పున రెండు విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు…
CP Sudheer Babu : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఛేదించి సంచలనం రేపారు. గుజరాత్లో జన్మించిన పసి పిల్లలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి అమ్మకాల యత్నం చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఆడ శిశువులను రూ. 2.5 లక్షలకు, మగ శిశువులను రూ. 4.5 లక్షలకు విక్రయిస్తుండగా, పోలీసుల దాడిలో వారి పథకం భగ్నమైంది. దీనికి సంబంధించిన సమాచారం ముందస్తుగా అందుకున్న…
Apollo Quiboloy: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో పోలీసులు అపోలో క్విబోలాయ్ ను అరెస్టు చేశారు. క్విబోలాయ్ తనను తాను “దేవుని కుమారుడు”గా ప్రకటించుకున్నాడు. ఆయన ఓ యేసు క్రీస్తు రాజ్యం (KOJC) చర్చ్ పాస్టర్. రెండు వారాలకు పైగా సాగిన భారీ శోధన తర్వాత పోలీసులు క్విబోలాయ్ను అరెస్టు చేయగలిగారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అపోలో క్విబోలాయ్ కు అనుచరులు. 74 ఏళ్ల క్విబోలాయ్‌పై పిల్లల అక్రమ రవాణా, లైంగిక…
Pakistan : అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన వహీదా, ఆమె కుమారుడు గత ఏడాది అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి పట్టుబడ్డారు. మహిళ, ఆమె కుమారుడు పాకిస్తాన్లో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపారు.