హైదరాబాద్ పట్టణ పరిధిలోని ప్రధాన బస్ స్టాప్‌ల దగ్గర జనం బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి , కేతేపల్లి మండల పరిధిలోని కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కార్తికమాసంలో తొలి సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని చెబుతారు.. ఈ సందర్భంగా గోదావరి నది భక్తులతో కిటకిటలాడుతోంది.. కార్తిక మాసంలో మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి.
తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్ట శ్రీఅంజనేయ స్వామి ఆలయం నేడు హనుమాన్ జయంతి సందర్భంగా కాషాయమయంగా మారింది. దీంతో కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు కొండగట్టు చేరుకున్నారు. దీంతో అంజన్న దర్శనానికి అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించకునేందకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్..…
వేసవి సెలువు వచ్చిందటే చాలు.. పిల్లలకు కేరింతలు కొడుతూ సందడి చేస్తుంటారు. పరీక్షల తరువాత తమ పిల్లలను టూర్‌కో.. ఆహ్లాదకరమైన ప్రదేశాలకో తీసుకెళ్తుంటారు. అయితే ఎంతో మంది హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ను కూడా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా నెహ్రూ జూ పార్క్ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. ఈ రోజు కూడా భారీగా పర్యాటలకు రావడంతో జూ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. వీకెండ్‌లోనే కాకుండా ఈ వేసవి కాలం కారణంగా.. మాములు…