Nehru Zoo Park : వేసవి సెలవులతో జూ పార్క్‌లో సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి సెలువు వచ్చిందటే చాలు.. పిల్లలకు కేరింతలు కొడుతూ సందడి చేస్తుంటారు. పరీక్షల తరువాత తమ పిల్లలను టూర్‌కో.. ఆహ్లాదకరమైన ప్రదేశాలకో తీసుకెళ్తుంటారు. అయితే ఎంతో మంది హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ను కూడా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత రెండు వారాలుగా నెహ్రూ జూ పార్క్ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. ఈ రోజు కూడా భారీగా పర్యాటలకు రావడంతో జూ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. వీకెండ్‌లోనే కాకుండా ఈ వేసవి కాలం కారణంగా.. మాములు రోజుల్లోనూ పార్కును విజిట్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందంటూ జూ అధికారులు చెప్తున్నారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 5 నుంచి 6 వేల మంది వస్తుండగా.. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 10 వేలకు పైగానే ఉంటోందని అధికారులు వెల్లడిస్తున్నారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల నుంచి జనాలు వస్తుండటంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పార్కు లోపల అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూ మాస్క్‌ను తప్పనిసరి చేశారు. ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లనివ్వట్లేదు. రద్దీ పెరుగుతుండటంతో నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుందని పార్కులో సైక్లింగ్‌ను ఆపేసినట్లు అధికారులు చెప్తున్నారు. వేసవి కావడంతో లోపల సేదతీరేందుకు బెంచీలు, డ్రింకింగ్ వాటర్ పాయింట్లను పెంచామన్నారు.
Also Read
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?