ప్రపంచంలో ఉన్న వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రపంచ వ్యాప్తంగా అశేషమైన భక్తజనం ఉన్నారు. వీరిందరికీ కూడా టీటీడీనే అన్నిరకాల వసతి, సదుపాయాలను కల్పిస్తోంది. ఈ పాలక మండలిలో సభ్యత్వం లభించిన వారికి నేరుగా శ్రీవారిని సేవించుకునే అవకాశం దక్కుతుంది. దీంతో టీటీడీ బోర్డులో స్థానం దక్కించుకునేందుకు రాజకీయ నేతల దగ్గరి నుంచి వ్యాపారులు, సంపన్నులు, సేవాపరులు పోటీపడుతూ ఉంటారు. ఇందులో చోటు…