KLR Pharmacy College Ragging Case: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి చాలా మంది విద్యార్థులు వెళ్లిపోతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓ బాధిత విద్యార్థిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ర్యాగింగ్ వేధింపులు భరించలేక కాలేజీ నుంచి వెళ్లిపోయిన తనకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం…
గుడ్డు తిని చిన్నారి మృతి చెందడంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది.
Life Threatening: 9వ క్లాస్ చదువుతోన్న ఓ విద్యార్థి నాకు ప్రాణహాని ఉందంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం పల్నాడులో సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 9వ తరగతి విద్యార్థి డేవిడ్.. ఈ రోజు హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు.. ఆస్తికోసం తనను చంపడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు ఆరోపించాడు.. తాను పుట్టగానే తన తల్లి చనిపోయిందని, తల్లి నుంచి సంక్రమించిన ఆస్తిని తన మేనమామ భార్య, అతని కుటుంబ సభ్యులు కాజేయడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం…
ఆస్తుల కోసం తోబుట్టువులను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ అన్న తన చెల్లెలి కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన దుర్గారావు తన చెల్లి కోసం హస్తిన బాట పట్టాడు. తన సోదరి నవ్యతను చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018లో పెళ్లి చేశాడు. కట్నంగా 23 లక్షల డబ్బు బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు.…
వర్షం వచ్చందంటే చాలు హైదరాబాద్‌లో మురికి కాలువలు పొంగిపొర్లుతుంటాయి. దీంతో మురికి నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు జీహెచ్ఎంసీపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వరద నీటి రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాకుత్ పురా స్థానికులు హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.…
ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని రోగులు వాటిని ఆశ్రయిస్తుంటారు. కానీ కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంతో కాన్పుకోసం వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో గత ఏడాది జరిగిన ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీన కాన్పు కోసం చేరిన బొంతు సునీత అనే మహిళ ఆస్పత్రికి వచ్చింది. కాన్పు కోసం సర్జరీ కిట్ బయట…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్‌లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్‌కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు…
కరీంనగర్ సీవీఎం ప్రైవేటు హాస్పిటల్ నిర్వకంపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీవీ కథనాలను సుమోటోగా స్వీకరించింది మానవ హక్కుల కమిషన్. సీవీఎం హాస్పిటల్ లో వెంటిలేటర్ సరిగా లేక రోగి మరణించాడు. అయితే చనిపోయిన విషయం చెప్పకుండా.. ఫైనల్ బిల్లు చెల్లించాలని కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేసారు హాస్పిటల్ సిబ్బంది. ఈ ఘటన పై ఎన్టీవీ చూపిన కథనాలపై స్పందించిన హెచ్చార్సీ… కలెక్టర్, DMHO కు నోటీసులు పంపింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్…