Life Threatening: 9వ క్లాస్ చదువుతోన్న ఓ విద్యార్థి నాకు ప్రాణహాని ఉందంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం పల్నాడులో సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 9వ తరగతి విద్యార్థి డేవిడ్.. ఈ రోజు హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు.. ఆస్తికోసం తనను చంపడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు ఆరోపించాడు.. తాను పుట్టగానే తన తల్లి చనిపోయిందని, తల్లి నుంచి సంక్రమించిన ఆస్తిని తన మేనమామ భార్య, అతని కుటుంబ సభ్యులు కాజేయడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాలుడు.. కూలి పనులు చేయిస్తూ అన్నం కూడా సరిగా పెట్టకుండా వేధించేవారని చెబుతున్నాడు ఆ బాలుడు. తాను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నానని.. అనాథగా ఉన్నా తనకు ఇబ్బంది లేదని, కానీ, తన జోలికి వాళ్లు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇదే వ్యవహారంలో గతంలో పోలీసులు ఆశ్రయించాడు డేవిడ్.. అయితే, ఆ తర్వాత కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తున్న ఆ విద్యార్థి.. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించానని చెబుతున్నాడు. కాగా, ఆస్తి కోసం అయినవారిన సైతం వేధింపులకు గురిచేసిన సందర్భాలు, ప్రాణాలు తీసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. అన్నదమ్ములు, అయినవారు, చివరకు ఆస్తి కోసం అమ్మనాన్నల ప్రాణాలు తీసిన ఘటనలు కూడా ఎన్నో వెలుగుచూసిన విషయం విదితమే.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్