అన్నింటికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది.. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆధార్ కార్డు చూపించడం, అవసరం అయితే జీరాక్స్ కాపీ ఇవ్వడం జరుగుతోంది.. ఇక, పుట్టగానే ఆధార్ నంబర్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. ఆస్పత్రిలో పుట్టిన వెంటనే ఆ పసికూనలకు ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పైలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేసింది..…
విశాఖలోని బ్రాండిక్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని బ్రాండిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి , దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజీపీ డిమాండ్ చేస్తోందన్నారు. విశాఖపట్నంలో అత్యంత విషాదంగా ఘటన ఎల్జీ పాలిమర్స్ తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు చర్యలు…
ఆస్పత్రుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.. ఇక, మెదక్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజీలు వస్తాయని వెల్లడించారు హరీష్‌రావు.. త్వరలో పటాన్‌చెరులో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి…
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రులు. ఉదయం 9 గంటలకు బాసరలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 9.20 గంటలకు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు. 12.15 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో…
అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 13 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. సోమవారం రోజున 1.32 లక్షల మంది కరోనాతో చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. రాబోయే వారం పదిరోజుల్లో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. సుమారు 2 నుంచి మూడు లక్షల మంది ఆసుపత్రుల్లో చేరతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలరాడో, లూసియానా, మేరిలాండ్,…
భారత్‌లో కరోనా సునామీ మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. బుధవారం 58000 కరోనా కేసులు నమోదు కావటం తీవ్రతను తెలియజేస్తోంది. గత తొమ్మిది రోజులతో పోలిస్తే కేసులు ఆరు రెట్లు పెరిగాయి. రాబోవు కాలంలో ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో అంచనా వేయటం కూడా కష్టమే. మరోవైపు, దేశంలో ఒమిక్రాన్ కేసులు రెండు వేలకు దగ్గరయ్యాయి. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విదేశీ ప్రయాణికులలో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు కట్టడి…
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతోనే అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ…
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాక్సినేషన్ మరింత ఉద్ధృతంగా చేయాలని, కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్స్‌ను వీలైనంత త్వరగా వినియోగించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎంత త్వరగా పూర్తి చేయగలుగుతారనేది మీ ముందున్న టాస్క్ అన్నారు. ప్రజలందరూ మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలి. జనాలు గుమిగూడకుండా చూడాలి. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.…