ఇవాళ ఆదివాసీ దినోత్సవం… ప్రభుత్వాలు ఎంతో ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటాయి. అయితే ఆ అడవిబిడ్డల అగచాట్లు మాత్రం తీరడంలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. విజయనగరం జిల్లాలో ఆదివాసీ దినోత్సవం నాడు గిరిజనులు వినూత్న నిరసన తెలిపారు. శృంగవరపుకోట మండలంలోని గిరిజన గ్రామాలయిన దారపర్తి పంచాయతీ ,బొడ్డవర పంచాయితీ ,రేగ పుణ్యగిరి గ్రామాలలో సుమారుగా 4 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఇటు మైదాన ప్రాంతంలోనూ అదేవిధంగా కొండకోనల్లోనూ వారంతా నివసిస్తున్నారు. వీరి సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి?
YSRTP Sharmila Kodangal Tour: నేడు రేవంత్ రెడ్డి ఇలాకాలో షర్మిల ప్రజా ప్రస్థాన పాద యాత్ర
సర్టిఫికెట్లు వరకే మేము గిరిజనులమా? మాకు గిరిజన ఫలాలు, హక్కులు, సమస్యలు, ఈ జిల్లాలో ఎవరు తీరుస్తారు? ఈ జిల్లా రెండుగా విడిపోయినాక, చాలామంది గిరిజనులకు ఆర్.ఎ.ఎఫ్ పట్టాలు ఇవ్వలేదు. ఐటీడీఏ నుంచి లోన్లు, భూ అభివృద్ధి పథకాల కోసం కొన్ని సబ్సిడీలు, ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఐ టి డి ఏ నుంచి పాస్ ఇచ్చేవారు ఇప్పుడు ఎవరిస్తారు? గిరిజనులకు కొన్ని గ్రామాల్లో పెత్తందారుల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రత్యేక విభాగంలో ఎక్కడ కేటాయిస్తున్నారు? విద్యార్థుల యొక్క సర్టిఫికెట్ సమస్యలు, ఎస్టీ కోటలో విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపులు, వారి స్కాలర్షిప్స్ తదితర టెక్నికల్ సమస్యలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ఐటిడిఏలో ఎంప్లాయిమెంట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకొని ఉన్న వేలమంది విద్యార్థులు ఏం కావాలి?
ఐటీడీఏతో ఇంకా చాలా సమస్యలు గిరిజనులకు ముడిపడి ఉన్నాయి. అందుకని ఆదివాసీ దినోత్సవం రోజున ఈ జిల్లా గిరిజనులకు మినీ ఐటిడిఏ ఏర్పాటు చేసి, గిరిజన బ్రతుకులను మార్చవలసిందిగా ప్రభుత్వాలను కోరుతున్నారు. ప్రతి సోమవారం గిరిజనులకు ప్రత్యేక గిరిజన గ్రీవెన్స్ ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ జిల్లాలో గిరిజనులకు ప్రత్యేక గిరిజన భవనం ఉంది. దాన్ని గిరిజనులకు అంకితం చేయాలంటున్నారు.
దారపర్తి పంచాయతీ 14 గ్రామాలకు, మారిక గ్రామంలో డీకే పర్తి పంచాయతీకీ, రోడ్లు సౌకర్యం, మంచినీరు, పాఠశాలలు, సౌకర్యాలు కల్పించాలంటున్నారు. ప్రసవం కోసం డోలిమోతలను ఆపే విధంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ రోజున ఒక హామీ కావాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యలన్ని విజయనగరం జిల్లా మంత్రివర్యులు, కలెక్టర్ పరిష్కరించే విధంగా చేయాలని ఇదే గిరిజనులకు మీరిచ్చే గౌరవంగా భావిస్తామని గిరిజన సంఘం నేత గౌరీష్ విన్నవిస్తున్నారు. మరి వీరి విన్నపాలు అలాగే వదిలేస్తారా? వచ్చే ఆదివాసీ దినోత్సవం నాటికైనా వాటి అమలుకు శ్రీకారం చుడతారో లేదో చూడాలి.
New Delhi: ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భారీ భద్రత