వరంగల్ నగరంలోని కొవిడ్ చికిత్స అందిస్తున్న హన్మకొండలోని మ్యాక్స్‌కేర్, వరంగల్ ములుగు రోడ్డులోని లలిత ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండు హాస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. రెండు రోజుల కిందట అర్బన్‌లోని ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు అధిక ఛార్జీల వసూలు, సౌకర్యాల లోపంపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి నేరుగా నోటీసులు జారీ చేసింది. అందులో పేర్కొన్న రెండు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు తగ్గడంతో రెగ్యులర్ సేవలు ప్రారంభిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడంతో కరోనా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కోవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయి, ఆసుపత్రుల్లో రద్దీ కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న…
తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లు రేపటి నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నేపథ్యంలో జూడాల సమ్మెపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారులతో ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం.. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని..…
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నతమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రస్తుతం అత్యవసర సేవలు మినహా మిగతా విధుల బహిష్కరణ కొనసాగిస్తోంది తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్… అయితే, ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేక పోవడంతో.. రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 10వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చారు జూడాలు… పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో పేర్కొన్నారు.. ప్రభుత్వం…
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నిజానికి అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈ యేడాది ఆయన పుట్టిన రోజును గతంలో కంటే కూడా భిన్నంగా ఓ గొప్ప మానవతామూర్తిగా జరుపుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందులో కేరళ కూడా మినహాయింపేమీ కాదు. అయితే మల్లూవుడ్ కు చెందిన ఈ మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలోని వివిధ ప్రాంతాలలో…
బ్లాక్ ఫంగస్ కు చికిత్స ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి కేటాయించారు అనో అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేషంట్ల రూపంలో వెళ్లి నిఘా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. జిల్లాలో 39 ప్రైవేట్ హాస్పిటల్స్ కు వేసిన కోటి 54 లక్షల రూపాయల పెనాల్టీని…
కరోనా బాధితుల చికిత్సలో ఆక్సిజన్ పాత్ర కీలకమైనది.. కరోనాబారిన పడి ఆస్పత్రి చేరాడంటేనే ఆక్సిజన్ తప్పనిసరి.. అయితే, వరుసగా కేసులు పెరగడం.. క్రమంగా ఆస్పత్రులకు తాకిడి పెరగడంతో.. ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది.. దీంతో.. ఆస్పత్రులు, అంబులెన్స్‌లు సైతం ఆక్సిజన్ ఏజెన్సీల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.. విజయవాడలో గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.. మరో మూడు రోజుల్లో నగరంలో నిల్వ ఉన్న ఆక్సిజన్ మొత్తం అయిపోతుందని చెబుతున్నారు ఆక్సిజన్ సప్లేయర్స్..…