Akshay Kumar Injured In Housefull 5 movie shooting: సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అక్షయ్ కుమార్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం ‘హౌస్‌ఫుల్ 5 ‘ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా అనుకోకుండా కొన్ని వస్తువులు అతనిపై పడ్డాయి. దానివల్ల ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ కంటికి గాయమైంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అక్షయ్ తన సినిమా పనిపై చాలా సీరియస్‌గా ఉంటాడు.
Also Read: World Chess Champion: విశ్వనాథ్ ఆనంద్ తర్వాత.. ప్రపంచ ఛాంపియన్‌గా గుకేశ్
తన సినిమాలలో చాలావరకు యాక్షన్ సీన్స్ కూడా స్వయంగా చేస్తాడు. సెట్‌లో అన్ని రకాల సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదం జరిగిందని సమాచారం. అయితే, అక్షయ్ తీవ్రంగా గాయపడలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అతి త్వరలో కోలుకుని షూటింగ్‌లో తిరిగి పాల్గొనే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయినప్పటికీ, తాజాగా తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే ఈ ఘటనతో అక్షయ్ యాక్షన్ సీన్స్ ఆగిపోయాయి. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అక్షయ్ తన షూటింగ్‌లను సమయానికి పూర్తి చేయడానికి చాలా ఇష్టపడతాడు. అందుకే ఆయన త్వరలో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
Also Read: Car Price Hike Alert: కారు కొందామనుకుంటున్నారా? అయితే వెంటనే కొనండి.. ఆలస్యమైతే ఇక బాదుడే