ఏపీలో శాంతిభద్రతల పరిస్ధితులు, హోంశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందే అని స్పష్టం చేశారు. దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్ రూపొందించాలన్నారు. నెలరోజుల్లోగా యాప్ రూపకల్పన చేయాలన్నారు. ఆడియోనూ ఫిర్యాదుగా పంపొచ్చు. నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం చేయాలన్నారు. మండల స్థాయి వరకూ ఏసీబీ…
ఏపీలో జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. పాతకొత్త కలయికతో మంత్రులు కొలువుదీరారు. అవినీతిలో కూరుకున్న వారిని కేబినెట్ లోకి తీసుకున్నారని, జగన్ కేబినెట్ లో మంత్రులకు పవర్ ఉందా ? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సీఎం జగన్ బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలరా? బీసీలను ముఖ్యమంత్రిని చేసి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా అన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లకు టేబుల్ – కుర్చీలైనా ఉన్నాయా? అని సోము…
ఉపేంద్ర హీరోగా నటించిన ‘ఐ లవ్ యూ’ మూవీ 2019లో విడుదలైంది. దీనిని తెలుగులోనూ డబ్ చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న నాలుగైదు కన్నడ చిత్రాలు సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రముఖ నటి వేదికతో కలిసి ఉపేంద్ర నటించిన ‘హోమ్ మినిస్టర్’ మూవీ ఏప్రిల్ 1న జనం ముందుకు రాబోతోంది. విశేషం ఏమంటే ఆ తర్వాత వారమే ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ‘గని’ చిత్రం సైతం కన్నడలో డబ్…
సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల…
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న వేళ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే మహమ్మారికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదని అన్నారు. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్నవారికి వ్యాక్సిన్ అందిస్తున్నందువలన అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. Read: నయా రికార్డ్:…
మహిళలపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాం… దిశ యాప్ తో మహిళల దశ మారుతుంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు వాహనాలు చెడిపోయినా దిశా యాప్ ను ఆశ్రయిస్తున్నారు… మహిళా రక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం… కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎలాగో మా ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేసి ప్రజాగ్రహాన్ని టిడిపి చవిచూసింది. వైసీపీ…
దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలను వివరించారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులు. జనవరి 15 లోపు డీపీఆర్ లు కేఆర్ఎంబీకి సమర్పించాలని..డీపీఆర్ ల ఆధారంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం. ఏపీకి తెలంగాణ రూ.6015…
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు సీఎం జగన్. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక…
దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సమావేశానికి తిరుపతి నగరం సిద్ధమయింది. ఈ నెల 14వ తేదీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమి త్ షా ఈనెల 13వ తేదీ రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడినుండి 7:45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.05 గంటలకు తాజ్ హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈనెల 14వ తేదీ ఉదయం…
బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతు ఇచ్చిన నాటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.…