అసభ్య ప్రవర్తన కలిగిన హోంగార్డును కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విధుల నుంచి తప్పించారు. హోంగార్డు 304 బీ.అజయ్ కుమార్ అసభ్య నృత్యాలు చేస్తూ అనుచిత ప్రవర్తన కలిగి పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో.. సదరు హోంగార్డుపై క్రమశిక్షణ చర్యలకు జిల్లా ఎస్పీ ఉపక్రమించారు. ప్రజారక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ విధుల్లో పాల్గొనవలసిన హోంగార్డ్ అసభ్య నృత్యాలు చేస్తూ ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా విస్తృతంగా వ్యాపించడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వాటిపై…
పోలీస్ శాఖలో ఇప్పుడు అక్రమార్కులు పుట్టుకొస్తున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని అరికట్టాల్సిన 'రక్షక భటులే భక్షక భటులుగా' మారుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ చేతులు చాచుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఎయిర్‌పోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, హోంగార్డు ఓ అడుగు ముందుకే అక్రమ దందా ప్రారంభించారు. అక్రమ సొమ్ముకు కక్కుర్తి పడి తమ స్థాయిని, బాధ్యత మరిచారు. కంచే చేను మేసినట్లు, అవినీతిపరుల ఆటకట్టించాల్సిన పోలీసులే అడ్డదారుల తొక్కారు. అసలేం జరిగిందంటే..
Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ భీభత్సం సృష్టించింది. కారు చెకింగ్ సమయంలో డ్రైవర్ కారు ఆపకుండా దూసుకెళ్ళిపోయాడు. కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ఉదయం తనిఖీలు చేపట్టారు.
ప్రపంచంలో చాలామంది రోజు కష్టపడి వచ్చిన సొమ్ముతో జీవనం కొనసాగిస్తారు. అయితే కొందరు మాత్రం తప్పుడు దారులను ఎంచుకొని దొంగతనాలు, బెదిరించడం లాంటి అనేక అక్రమ మార్గాలలో డబ్బులను సంపాదించి జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఇలా దొంగతనాలు చేసి పట్టుబడిన వారిని పోలీసులు జైల్లో ఉంచుతారు. అలాంటిది ఓ పోలీస్ హోమ్ గార్డ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే తన చేతివటాన్నీ ప్రయోగించాడు. దాంతో ఇప్పుడు ఆ హోంగార్డ్ ఇనుప పూసలు లెక్కబెడుతున్నాడు. ఈ విషయం సంబంధించి పూర్తి…
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా విషయమేమీ కాదు ఇది రెండేళ్లుగా రాజకీయవర్గాల్లో నానుతున్న సంగతే.
Uttar Pradesh: కిడ్నీలో ప్రాబ్లం ఉందని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. అక్కడి వైద్యులు చేసిన తనకు చేసిన ఘనకార్యం తెలిసి షాకయ్యాడు. కిడ్నీ లో రాళ్లు ఉన్నాయని హాస్పిటల్ కి వెళ్తే .. ఏకంగా కిడ్నీనే కొట్టేశారు అక్కడి ఘనులు.
నిత్యం ఏదోఒకచోట మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. ఎవరిని నమ్మాలో.. ? ఎవడు నమ్మించి కాటేస్తాడో..? కూడా తెలియని పరిస్థితి దాపురించింది.. రక్షలుగా ఉండాల్సిన వారే భక్షిస్తున్న ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయి.. తాజాగా, అరాచకానికి పాల్పడిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగు చూసింది.. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి మహిళ పై అత్యాచారం చేసిన హోమ్ గార్డుపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు… అంతే కాదు, అత్యాచారం చేసిన దృశ్యాలను తన మొబైల్‌లో…
ఉద్యోగం పేరు చెబితే ఎన్ని లక్షలైనా ఖర్చుచేయడానికి వెనుకాడని రోజులివి. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలను సినిమాల్లో సైతం కామెడీగా చూపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీసు కార్యాలయంలో హోమ్ గార్డు ఘరానా మోసం బయటపడింది. కరోనా కారణంగా నలుగురు హోంగార్డులు చనిపోయారు వారి పోస్టులు ఖాళీ ఉన్నాయని వాటిని మీకే వచ్చేలా చూస్తానంటూ అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ..ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి లక్షల వసూలు చేశాడో హోం గార్డు.…
తెలంగాణలో సంచలనం కలిగించిన సస్పెండైన హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రామకృష్ణ అదృశ్యమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్ అనే వ్యక్తి రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడని అతని భార్య భార్గవి తెలిపింది. అయితే రామకృష్ణ హత్యకు గురయిన సంగతి తనకు ఆలస్యంగా తెలిసిందని, పోలీసులు ఏం మాట్లాడడడం లేదని పేర్కొంది. రామకృష్ణ డెడ్ బాడీ సిద్దిపేట జిల్లాలో లభ్యం అయింది. తన తండ్రి వెంకటేశే.. రామకృష్ణను హత్య…