ప్రపంచంలో చాలామంది రోజు కష్టపడి వచ్చిన సొమ్ముతో జీవనం కొనసాగిస్తారు. అయితే కొందరు మాత్రం తప్పుడు దారులను ఎంచుకొని దొంగతనాలు, బెదిరించడం లాంటి అనేక అక్రమ మార్గాలలో డబ్బులను సంపాదించి జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఇలా దొంగతనాలు చేసి పట్టుబడిన వారిని పోలీసులు జైల్లో ఉంచుతారు. అలాంటిది ఓ పోలీస్ హోమ్ గార్డ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే తన చేతివటాన్నీ ప్రయోగించాడు. దాంతో ఇప్పుడు ఆ హోంగార్డ్ ఇనుప పూసలు లెక్కబెడుతున్నాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: OYO Room: లవర్ తో కలసి ఓయోకు వెళ్లిన యువకుడు.. కొద్ది క్షణాలకే..
ప్రజల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ గార్డు తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో చోటుచేసుకుంది. నగరంలోని రెండో పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుబడిన డబ్బును బీరువా లాకర్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న హోంగార్డు మనోజ్ పోలీసులతో సన్నిహితంగా ఉండేవాడు. అలా ఉండడంతో బీరువా తాళాలు ఇచ్చి ఫైళ్లను తనతో తీసుకురావాలని ఓ కానిస్టేబుల్ కోరాడు. దీంతో మనోజ్ బీరువాలో ఉన్న డబ్బుల పై కన్ను వేసాడు. దాంతో బీరువాలో ఉన్న సొమ్మును చూసి రూ.5.63 లక్షలు డబ్బులను దొంగతనం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోమ్ గార్డ్ మనోజ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు. నిందితుడి నుంచి రూ.300,000 నగదు స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.