తెలంగాణలో సంచలనం కలిగించిన సస్పెండైన హోంగార్డు రామకృష్ణ హత్యకేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రామకృష్ణ అదృశ్యమయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన లతీఫ్ అనే వ్యక్తి రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడని అతని భార్య భార్గవి తెలిపింది. అయితే రామకృష్ణ హత్యకు గురయిన సంగతి తనకు ఆలస్యంగా తెలిసిందని, పోలీసులు ఏం మాట్లాడడడం లేదని పేర్కొంది. రామకృష్ణ డెడ్ బాడీ సిద్దిపేట జిల్లాలో లభ్యం అయింది. తన తండ్రి వెంకటేశే.. రామకృష్ణను హత్య చేయించాడని భార్గవి భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతీఫ్ తన భర్తను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తన భర్తను నమ్మించి తీసికెళ్ళాడని భార్గవి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా వుంటే.. రామకృష్ణ భార్య భార్గవి అనేక అంశాలు బయటపెట్టింది. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదు. మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావు ని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా అని నన్నే ప్రశ్నించారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ రామకృష్ణ ను సంప్రదించారని భార్గవి తెలిపారు.
Read Also: Honour Killing: భువనగిరిలో పురువు హత్య..
లతీఫ్ ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణ కు పరిచయం చేశారు. ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారని, రామకృష్ణను నమ్మించేందుకు అతని అకౌంట్లో డబ్బులు కూడా వేసి బయటకు తీసికెళ్ళారని భార్గవి పేర్కొన్నారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తనకు తన పుట్టింటితో సంబంధాలు లేవంటోంది భార్గవి. మేం చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు. తన భర్తను హత్య చేసినటువంటి నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. తన తండ్రి తన వద్దకు వెళ్తానని రామకృష్ణ ని హత్య చేయించి ఉంటాడు. నా భర్త ను హత్య చేస్తే తండ్రి దగ్గరకు వెళ్తాను అని అనుకున్నాడు. తన తండ్రి వద్దకు వెళ్ళే ప్రసక్తే లేదంటోంది రామకృష్ణ భార్య భార్గవి.