దొంగతనానికి వచ్చారు.. ఉన్నదంతా దోచుకున్నారు. అయితే ఇంతలోనే ఆకలి అయింది. దొంగలు ఏమనుకున్నారో ఏమో వంటింట్లో దూరారు. ఏమీ తినబండ్రాలు కనబడలేదు. అయితే ఫ్రిజ్లో పాలు కనపడ్డాయి. వాటిని తీసుకొని మరిగించుకొని తాగడమే కాకుండా.. తాగిన గ్లాసులను కడిగి అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఈ దొంగల వ్యవహారాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో నీ ఇంటిలో దొంగతనం జరిగింది. పెళ్లి కోసం దాచిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును కూడా దొంగలు దోచుకు…