Jagathgiri Gutta: వెరైటీ దొంగ.. అంతా దోచాడు.. కానీ ఆకలి తీరక పాలతో సరిపెట్టాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగతనానికి వచ్చారు.. ఉన్నదంతా దోచుకున్నారు. అయితే ఇంతలోనే ఆకలి అయింది. దొంగలు ఏమనుకున్నారో ఏమో వంటింట్లో దూరారు. ఏమీ తినబండ్రాలు కనబడలేదు. అయితే ఫ్రిజ్లో పాలు కనపడ్డాయి. వాటిని తీసుకొని మరిగించుకొని తాగడమే కాకుండా.. తాగిన గ్లాసులను కడిగి అక్కడే పెట్టి వెళ్లిపోయారు. ఈ దొంగల వ్యవహారాన్ని చూసి పోలీసులు సైతం విస్తుపోయారు.
జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో నీ ఇంటిలో దొంగతనం జరిగింది. పెళ్లి కోసం దాచిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును కూడా దొంగలు దోచుకు పోయారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు తతంగం మొత్తం కూడా దొంగతనం తర్వాతే జరిగింది. దొంగలు వంటింటి లోకి వెళ్లారు. అక్కడ తినుబండారాలు ఏమీ కనబడలేదు. ఫ్రిజ్‌లో ఉన్న పాలను తీసుకొని వేడిచేసుకుని తాగి పోయారు. దొంగతనానికి వచ్చిన వారు తమ పని చేసుకొని పోక వంటింటి ని ఖాళీ చేయడం చూసి స్థానికులు సైతం విస్తుపోతున్నారు. ఎల్లమ్మబండ కు చెందిన పద్మకు ఇద్దరు కూతుళ్లు. మెహిదీపట్నంలో ఉంటున్న పెద్ద కూతురు కుమారుడు పుట్టినరోజు కావడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పద్మ తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలుపగలగొట్టి కనిపించింది. బీరువా పగులగొట్టి 8 తులాల బంగారం, 30తులాల వెండి, 20వేల నగదు కనిపించలేదు. బిడ్డ పెళ్లికోసం దాచుకున్న సొమ్ము మొత్తం చోరీ కావడంతో పద్మ బోరున విలపించింది. జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
Also Read
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!