తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడంపై సందిగ్ధత కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అంశంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా డైలామాలో పడ్డాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విభాగాల అధిపతుల దగ్గర నుంచి మంత్రి హరీశ్ రావు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నాను. వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి, వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూస్తున్నామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించింది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.
List Of Bank Holiday in July 2023: జూలై నెలలో ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 21 రోజులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ నెలలో మిగిలి ఉన్న శని వారాల్లో కేవలం ఒక్క శనివారం మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మిగతా శని వారాల్లో అన్ని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. మిగతా శని వారాల్లో బ్యాంకులు ఎందుకు…
బ్యాంకు కస్టమర్లకు గమనిక. ఈ రోజు 5వ శనివారం. ఈ రోజు బ్యాంకులు పని చేస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాలి. ఆదివారాలు, పండుగలు, ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, జాతీయ సెలవు దినాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.
Bank Holidays : కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది.
Andhra Pradesh: 2023 ఏడాదికి గానూ సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవుల్లో మూడు ఆదివారాలు, ఒకటి రెండో శనివారం.. ఐచ్ఛిక సెలవుల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. మకర సంక్రాంతి, దుర్గాష్టమి, దీపావళి ఆదివారాల్లో.. సాధారణ సెలవుల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతితో ఐదు ఐచ్ఛిక సెలవులను పొందేందుకు వీలు కల్పించింది. రంజాన్, బక్రీద్, మొహర్రం,…