2023 July Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. జులైలో ఒక శనివారం మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
List Of Bank Holiday in July 2023: జూలై నెలలో ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 21 రోజులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ నెలలో మిగిలి ఉన్న శని వారాల్లో కేవలం ఒక్క శనివారం మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. మిగతా శని వారాల్లో అన్ని బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. మిగతా శని వారాల్లో బ్యాంకులు ఎందుకు క్లోజ్‌గా ఉంటాయో తెల్సుకుందాం.
దేశంలో ఆదివారం బ్యాంకులు పని చేయవు అన్న విషయం తెలిసిందే. రెండు, నాలుగు శని వారాల్లో కూడా బ్యాంకులు పని చేయవు. ఇక జూలై నెలలో ఇప్పటికే రెండు శని వారాలు పూర్తయ్యాయి. ఇంకా మూడు శని వారాలు మిగిలి ఉన్నాయి. ఈ మూడింటిలో బ్యాంకులు ఒక శనివారం మాత్రమే పని చేస్తాయి. జూలై నెలలో ఐదవ శనివారం (జూలై 29) మొహర్రం పండగ ఉంది. ఆ రోజున బ్యాంకులు పని చేయవు. నాలుగవ శనివారం జూలై 22న ఉంది కాబట్టి ఆ రోజు కూడా బ్యాంకులకు హాలిడే. ఇక వచ్చే శనివారం (జూలై 15) మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఏమైనా పని ఉంటే.. వచ్చే శనివారం చూసుకుంటే సరిపోతుంది.
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
ఈ నెలలో బ్యాంకులకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉంటే.. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. ఏటీఎం, క్యాష్ డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. జూలై నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత నెలలోనే ప్రకటించింది. ప్రభుత్వ సెలవులు, ప్రాంతీయ సెలవులతో కలిపి ఈ నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి.
Also Read: Maruti Suzuki Offers: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
జూలై 2023లో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే:
# జూలై 2: ఆదివారం
# జూలై 5: గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులకు హాలీ డే)
# జూలై 6: ఎంహెచ్‌ఐపీ డే (మిజోరాం రాష్ట్రంలో సెలవు)
# జూలై 8: రెండో శనివారం
# జూలై 9: ఆదివారం
# జూలై 11: కేర్ పూజ (త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులు బంద్)
# జూలై 13: భాను జయంతి(సిక్కింలో బ్యాంకులు క్లోజ్)
# జూలై 16: ఆదివారం
# జూలై 17: యు టిరోట్ సింగ్ డే మేఘాలయలో బ్యాంకులకు సెలవు)
# జూలై 22: నాలుగో శనివారం
# జూలై 23: ఆదివారం
# జూలై 28: అషూరా (జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు హాలీ డే)
# జూలై 29: మొహర్రం (అన్ని రాష్ట్రాల్లో)
# జూలై 30: ఆదివారం
# జూలై 31: అమరవీరుల దినోత్సవం (హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సెలవు)
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!