Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. పాఠశాలల్లో ఈ సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలు జూలై 17 మరియు 18 తేదీలలో మూసివేయనున్నట్లు.. ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు, ఈశాన్య, సౌత్ ఈస్ట్, నార్త్, నార్త్ వెస్ట్ మరియు సెంట్రల్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు DOE (నార్త్ వెస్ట్-బి, వెస్ట్-ఎ, వెస్ట్-బి, సౌత్, సౌత్ వెస్ట్-ఎ, సౌత్ వెస్ట్-బి మరియు న్యూ ఢిల్లీ) మిగిలిన అన్ని పాఠశాలలు (ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన మరియు ప్రైవేట్ గుర్తింపు పొందినవి) సోమవారం యథావిధిగా ఓపెన్ కానున్నాయి.
Pawan Kalyan: రేపు తిరుపతికి పవన్.. అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు
Also Read
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
జూలై 13నుంచి యమునా నది నీటిమట్టం పెరుగుతూనే ఉన్నందున.. జూలై 16 వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనవసర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీలోని రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఇళ్లు కూలిపోవడం మరియు ట్రాఫిక్ జామ్‌లు వంటివి చాలా జరుగుతున్నాయి.
Viral Video: ప్రవహిస్తున్న వరదలో కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్..!
అంతేకాకుండా.. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. యమునా నది ఒడ్డున నివసిస్తున్న పేద కుటుంబాలు వరదల్లో తమ ఇళ్లు కోల్పోయాయని కొందరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువులన్నీ పోగొట్టుకున్నారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పడుతోందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!