కలియుగ వైకుంఠం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ ఆపద మొక్కులవాడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తిరుపతికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే టోకెన్ల కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు భక్తులు. గోవిందరాజ స్వామి సత్రాలు, శ్రీనివాస వసతి సముదాయాల వద్ద గంటల తరబడి టోకెన్ల కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. చంటిబిడ్డలు, వృద్థులతో వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: IPL 2023 : కోహ్లీకి డ్యాన్స్ నేర్పించిన కింగ్ ఖాన్
వరుస మూడు రోజులు సెలవులు రావడంతో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు కోసం రెండు, మూడు టీటీడీ సత్రాల వద్దకు చేరుకున్నారు భక్తులు. ఇంకా వేసవి సెలవులు రాకుండానే ఈ స్థాయిలో భక్తులు రావడంతో దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లుచేశారు. కాగా తిరుమలలో గత కొద్దికాలంగా 60 నుంచి 70వేలమంది దర్శనానికి వస్తున్నారు. శుక్రవారం 30 కంపార్టుమెంట్లలో దర్శనం కోసం వేచివున్నారు భక్తులు..టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు గా టీటీడీ తెలిపింది.
Read Also: Jai SriRam : అయోధ్య రాముడికి 155 దేశాల నదుల నీటితో మహా జలాభిషేకం