తెలంగాణలో గత నాలుగు రోజులుగా నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఆదివారం ప్రెస్ మీట్‌లో చెప్పారు. సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని విద్యా సంస్థలను మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చాలా…
తెలంగాణలో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రేపటి నుంచి అంటే జూలై 11 నుంచి జూలై 13 వరకు మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. Read Also: Amaranath Yatra: ఇద్దరు ఏపీ యాత్రికులు గల్లంతు.. ఏపీ సర్కార్ ప్రకటన మరోవైపు తెలంగాణలో…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం పనిచేయించుకుంటోంది. తాజాగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయులకు ఈ నెల 22 వరకు సెలవులు లేవని సమగ్ర శిక్ష అభియాన్ ప్రకటించింది. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాల పేరుతో టీచర్ల పనిదినాలను అధికారులు పొడిగించారు. విద్యార్థినుల ప్రవేశాల కోసం సిబ్బంది ప్రచారం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా 100 శాతం ప్రవేశాలు సాధించాలని టీచర్లకు ఆదేశాలు…
కోవిడ్ పరిస్థితుల పేరు చెప్పి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు పొడిగించడం, ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించడంపై మిశ్రమస్పందన కనిపిస్తోంది. అవగాహన లేక విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి,కొవిడ్ కెంద్రాలుగా తయారు చేస్తున్న వాటిని పట్టించుకోవడం లేదని, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు. సూపర్ మార్కెట్స్, మామూలు మార్కెట్లు, సినిమా థియేటర్స్, మాల్స్,వైన్స్,బార్స్,క్లబ్స్. రాజకీయ సమూహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వుందని విమర్శిస్తున్నారు. అవగాహనా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ…విద్యానందించే విద్యాసంస్థలను మూసివేయడం, పిల్లల భవిష్యత్తుపై…
తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెలవుల పొడిగింపు ప్రకటనను ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్-TRSMA) తీవ్రంగా ఖండించింది. అవగాహన లేకుండా విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి కోవిడ్ కేసులను పెంచుతున్న వారిని పట్టించుకోకుండా విద్యాసంస్థలను మూసివేయడమేంటని ప్రభుత్వాన్ని ట్రస్మా ప్రశ్నించింది. Read Also: కోవిడ్ ఎఫెక్ట్: రేపటి నుంచి ఆన్ లైన్ క్లాసులు మార్కెట్లు, సినిమా…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు రెండు లక్షల పైనే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లు నడిపే విషయంలో విద్యాశాఖ అధికారులు…
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల…
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన సెలవుల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే తాజాగా ఈ తేదీలను ప్రభుత్వం మార్చింది. ఇదివరకు ప్రకటించిన సెలవులకు బదులుగా ఈనెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 13, 14, 15 తేదీల్లోనే…
డిసెంబర్ నెలతో పాటు 2021 ఏడాది ముగింపునకు వచ్చింది.. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం.. అయితే, 2022 జనవరి నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి… అయితే, ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు వర్తించనున్నాయి.. మొత్తంగా చూస్తే.. ఏకంగా 15 రోజులకు పైగానే సెలవులు రాబోతున్నాయి.. వరుసగా బ్యాంకు లావాదేవీలు చేసేవారు.. బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్లు.. అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. 2022 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను విడుదల చేసింది రిజర్వు బ్యాంకు ఆఫ్…