World Famous Sport : క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలిలో అంతర్భాగంగా మారాయి. వివిధ దేశాలు, సంస్కృతులు, భాషలు ఉన్నా, క్రీడలతో మానవాళి ఏకతాటిపైకి వస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను కలిగి ఉన్న క్రీడ ఏదో తెలుసుకుందాం. 1. ఫుట్‌బాల్ (సాకర్) – 4 బిలియన్ అభిమానులు ఫుట్‌బాల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడ. దీని ఆటగాళ్ల సంఖ్య, ప్రేక్షకులు, అభిమానులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ప్రధాన టోర్నమెంట్లు: FIFA వరల్డ్ కప్,…
పలువురు క్రీడాకారులకు పద్మ అవార్డులు దక్కాయి. భారత మాజీ హాకీ గోల్‌కీపర్ PR శ్రీజేష్‌కు పద్మభూషణ్.. ఆర్ అశ్విన్, ఫుట్‌బాల్ లెజెండ్ IM విజయన్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. అంతేకాకుండా.. హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్‌లకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 2-1తో స్పెయిన్‌ను ఓడించి ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్స్‌లో కూడా బెల్జియం భారత్‌ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత్‌ను ఓడించింది.
POCSO Case Filed on Indian Hockey Player Varun Kumar: భారత హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై పోక్సో కేసు నమోదైంది. వరుణ్ కుమార్ తనపై గత ఐదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి పేరుతో గత ఐదేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల…
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్‌తో జరిగిన పూల్-ఎ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.