జపాన్‌లో జరిగిన 2023 మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ దక్షిణ కొరియాను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 2-1 స్కోరుతో ఓడించి తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా అవతరించింది.
Hockey Worldcup: హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. పూల్-డిలో భాగంగా శుక్రవారం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ విజయం సాధించింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అమిత్ రోహిదాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌ను భారత్ తొలుత నెమ్మదిగా ఆరంభించింది. ఆ తర్వాత ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేస్తూ దూకుడు పెంచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను జర్మన్ ప్రీత్ వృథా చేసినప్పటికీ ఆ…
కామన్‌వెల్త్ గేమ్స్-2022లో చివరి రోజు భారత్ పతకాల పంట పండించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో సింధు స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్ విభాగంలోనూ భారత్ మరో స్వర్ణం అందుకుంది
ఆసియా కప్ హాకీలో గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. 16-0 గోల్స్ తేడాతో ఇండోనేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇండియా ఫస్ట్ ఆఫ్‌లో 6-0తో ముందంజలో నిలవగా.. సెకండ్ ఆఫ్‌లో భారత ఆటగాళ్ల మరింత రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి 16 గోల్స్ కొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసిందనే చెప్పాలి. సూపర్-4 దశకు చేరుకోవడానికి భారత్ 15 గోల్స్ తేడాతో…
ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఎంతో ఆసక్తి రేపిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పాకిస్థాన్‌పై భారత్ చివరి వరకు దూకుడుగా ప్రదర్శించింది. ఫస్ట్ హాఫ్‌లో భారత ప్లేయర్ కార్తీ సెల్వమ్ తొలి గోల్ చేసి భారత్‌ను 1-0 లీడ్‌లోకి తీసుకెళ్లాడు. సెకండ్ హాఫ్‌లోనూ భారత్ ఆధిక్యంలో ఉండగా మ్యాచ్ ఒక్క నిమిషంలో ముగుస్తుందనగా పాక్ ఆటగాడు అబ్దుల్ రాణా గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. దీంతో దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్…
హాకీ..!! పేరుకే నేషనల్ గేమ్… ఆడేవాళ్లు కరువు. ఆదరణ అసలే ఉండదు. నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తే కానీ.. గుర్తుకు రాని గేమ్. హాకీ గ్రౌండ్స్ ఉండవు… హాకీ లీగ్స్ జాడలేదు. హాకీ వైపు వచ్చే క్రీడాకారులు ఒకరిద్దరే. వాళ్లూ కొన్ని రోజులే. మనది కాని గేమ్స్‌కి యమ క్రేజ్…!! కానీ జాతీయ క్రీడాను ఎందుకు పట్టించుకోరు. లోపం ఎక్కడుంది..? ఇండియా నేషనల్ గేమ్.. హాకీ..! అవును కదా..? అనుకునే రోజులివి. హాకీ జాతీయ క్రీడ అని కూడా…
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ ప్లేయర్లకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు బహుమతి ప్రకటిస్తున్నాయ్. పంజాబ్ సర్కార్ కోటి రూపాయలు ప్రకటిస్తే…హర్యానా రెండున్నర కోట్లు ఇస్తామని వెల్లడించింది. తామేమీ తక్కువ కాదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం…ఒక్కో ప్లేయర్ కోటి ఇస్తామన్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన హాకీ క్రీడాకారులకు…రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా నగదు నజారానాలు ప్రకటిస్తున్నారు. ఒక ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తామంటే…మరో ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించింది. జట్టు సభ్యులందరికి కాదు…కేవలం ఆయా రాష్ట్ర క్రీడాకారులకు మాత్రమేనని చెబుతున్నాయ్.…
భారత హాకీ చరిత్రలో గురువారం (ఆగస్టు 5) చరిత్రలో గుర్తుండిపోయే రోజు. మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం సాధించింది. 1980 మాస్కో తర్వాత ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇదే మొదటి పతకం. ఈవెంట్ మొత్తంలో 12వ పతకం. దీంతో పురుషుల హాకీ జట్టును ట్విట్టర్ లో అభినందనలు వెల్లువతో ముంచెత్తారు. ప్రధానితో పాటు క్రీడా దిగ్గజాలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రతి ఒక్కరూ…
ఎలాగైనా స్వర్ణం గెలవాలని టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌తో ప్రపంచ ఛాంపియన్ బెల్జియం చేతిలో ఒటమిపాలైన సంగతి తెలిసిందే. కాగా, ఈరోజు కాంస్యపతకం పోరులో భారత జట్టు జర్మనీతో తలపడింది. నాలుగు క్వార్టర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది. రెండు క్వార్టర్‌లు ముగిసే సరికి 3-3 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.…
టోక్యో ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేసిన హాకీ పురుషుల జట్టు సెమీస్‌లో పరాజయం పాలైంది. వరల్డ్ ఢిపెండింగ్ చాంపియన్ బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓడిపోయింది. మొదటి క్వార్టర్‌లో 2-1 తేడాతో లీడ్‌లో ఉన్న ఇండియా సెకండ్ క్వార్టర్‌లో సంచలనాలు చేయలేకపోయింది. అటు బెల్జియం జట్టు తనదైన శైలిలో విజృంభించి మరో గోల్ చేయడంతో సెకండ్ క్వార్టర్ 2-2తో సమం అయింది. అయితే, మూడో క్వార్టర్‌లో ఎవరూ ఎలాంటి గోల్ చేయలేదు. కానీ నాలుగో క్వార్టర్‌లో బెల్జియం…