ప్రముఖ కంపెనీ హిందూస్థాన్ యూనీలివర్ (HUL) సామాన్యులకు మరోసారి షాకిచ్చింది. గత ఏడాది నవంబరులోనే పలు ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్‌యూఎల్ తాజాగా మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్‌బాయ్ సబ్బుల ధరలను 3 నుంచి 20 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. తాజా ధరల ప్రకారం బట్టలు ఉతికేందుకు…