బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఖండించారు. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులు.. బౌద్ధులపై నిరంతర దాడుల నివేదికలు కలవరపెడుతున్నాయని, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం వారి భద్రతకు భరోసా ఇస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు. 'మతం, కులం, భాష లేదా గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస.. దాడులు ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదు' అని 'X' లో పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. గత కొద్ది రోజుల నుంచి రిజర్వేషన్ల విధానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేకదారులు రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో హసీనా సర్కారు పడిపోయింది.
Rahul Gandhi: లోక్‌సభలో సోమవారం విపక్ష నేత రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో చేసిన పలు వ్యాఖ్యలు రికార్డుల నుండి తొలగించారు. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో హిందువులు, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ గురించి వ్యాఖ్యానించడం గమనార్హం.
Pakistan: ఇటీవల పాకిస్తాన్‌లో దైవదూషణ చేస్తున్నాడనే నెపంతో ఓ స్థానిక పర్యాటకుడిని ప్రజలు అత్యంత దారుణంగా కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మతం పేరుతో ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై చాలా విమర్శలు వచ్చాయి. బాధితుడు మహ్మద్ ఇజ్మాయిల్ బహిరంగంగా మతోన్మాద గుంపు కాల్చి చంపింది.
జూలై 4న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
Hindu Population: 1950-2015 మధ్య భారతదేశంలో మెజారిటీ (హిదువుల) మతాల వాటా 7.8 శాతం తగ్గిందని, అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతం(ఇస్లాం) వాటా పెరిగిందని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్(EAC-PM) అధ్యయనం వెల్లడించింది.
పీఓకేపై తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో భాగమన్నారు. కాబట్టి, అక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ మా దేశ ప్రజలేనంటూ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదు.. ఒక్క ఝట్కా ( ఒక్క వేటుతో జంతువులను చంపడం )తో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన చెప్పుకొచ్చారు.
ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉంది.. 25 కోట్ల మంది ముస్లింలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారు.. హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెట్టేవాళ్ళ డిపాజిట్ గల్లంతు కావాలి.. ఈ ముప్పై రోజులు ప్రజల్లోకి వెళ్ళండి కాంగ్రెస్-బీజేపీ కుట్రలను ప్రజలకు చెప్పండి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Pakistan: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరు ఉల్ హక్ కాకర్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు తీవ్ర వివక్ష, వేధింపులను ఎదుర్కొంటున్నారు. అక్కడ నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోంది. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్లో రాజకీయ నాయకులు కూడా హిందువులను తుడిచివేయాలని చూస్తున్నారు.