Hindu Population: భారత్‌లో 8 శాతం తగ్గిన హిందూ జనాభా వాటా.. మైనారిటీల సంఖ్యలో పెరుగుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu Population: 1950-2015 మధ్య భారతదేశంలో మెజారిటీ (హిదువుల) మతాల వాటా 7.8 శాతం తగ్గిందని, అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతం(ఇస్లాం) వాటా పెరిగిందని ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్(EAC-PM) అధ్యయనం వెల్లడించింది. భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోగా, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగిందని చెప్పింది. అయినప్పటికీ జైనులు, పార్సీల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది. 1950-2015 మధ్య దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15 శాతం పెరిగిందని, క్రైస్తవుల్లో 5.38 శాతం, సిక్కులు 6.58 శాతం పెరుగులను చూశారని నివేదికే వెల్లడించింది.
EAC-PM ప్రకారం, భారతదేశంలో హిందువుల వాటా 1950లో 84 శాతం ఉంటే 2015లో 78 శాతానికి తగ్గింది. అదే సమయంలో ముస్లింల సంఖ్య 9.84 శాతం నుంచి 14.19 శాతానికి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. భారత్‌లోనే కాకుండా నేపాల్ లో మెజారిటీ(హిందూ) మతం జనాభా దాని వాటాలో 3.6 శాతం క్షీణతను చూసింది. మే 2024లో విడుదల చేసిన ఈ అధ్యయనం, ప్రపంచవ్యాప్తంగా 167 దేశాలను ట్రెండ్స్‌ని అంచనా వేసింది. డేటాను జాగ్రత్తగా విశ్లేషించడం ద్వారా భారత్‌లో మైనారిటీలు కేవలం రక్షించబడటమే కాకుండా, అభివృద్ధి చెందుతున్నారని అధ్యయన రచయితలు చెప్పారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Bastar: The Naxal Story OTT: ఓటీటీలో ఆదాశర్మ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాక్, బంగ్లాలో పెరిగిన ముస్లిం జనాభా:
ఇదిలా ఉంటే భారత్ సరిహద్దు ముస్లిం మెజారిటీ దేశాలుగా ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో మెజారిటీ(ముస్లిం) మతం జనాభా పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో అత్యధికంగా 18.5 శాతం, పాకిస్తాన్‌లో 3.75 శాతం, ఆఫ్ఘనిస్తాన్‌లో 0.29 శాతం మెజారిటీ మతం వాటా పెరిగింది. ఇదిలా ఉంటే మరో పొరుగు దేశం మయన్మార్‌లో కూడా మెజారిటీ కమ్యూనిటీ వాటాలో క్షీణత చూసినట్లు, మయన్మార్‌లో థెరవాడ బౌద్ధుల మెజారిటీ జనాభా 65 ఏళ్లలో 10 శాతం తగ్గింది. ఇక మాల్దీవుల్లో మెజారిటీ గ్రూపు(షఫీ సున్నీలు) వాటా 1.47 శాతం క్షీణించింది. ఇక భారత పొరుగు దేశాలైన భూటాన్, శ్రీలంకలో మెజారిటీ బౌద్ధ జనాభా వరసగా 17.6 శాతం, 5.25 శాతం పెరిగింది.
మొత్తం జనాభాలో మైనారిటీల నిష్ఫత్తి మార్పు దేశంలో మైనారిటీల స్థితిని తెసుకునేందుకు పనిచేస్తుందని, ఇది మైనారిటీలను నిర్వచించడం, పాలసీల రూపకల్పనను ప్రోత్సహిస్తుందని, ఇది ప్రపంచవ్యాప్తంగా అరుదైన పద్ధతి అని అధ్యయనం తెలిపింది.
Read Also: Raghunandan Rao : వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చిండు
క్షీణిస్తున్న మెజారిటీ..
ప్రపంచవ్యాప్తంగా భారత్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా మెజారిటీ వాటా క్షీణిస్తున్నట్లు అధ్యయనం వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో ఆస్ట్రేలియా, చైనా, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు, తూర్పు ఆఫ్రికా దేశాలలో మెజారిటీ కమ్యూనిటీ వాటా భారత్ కన్నా ఎక్కువగా పడిపోయింది. 1950-2015 నుండి 167 దేశాలలో మెజారిటీ మతపరమైన తెగల వాటా సగటున 22% తగ్గింది. లైబీరియాలో 99 శాతం తగ్గితే, నమీబియాలో 80 శాతం మెజారిటీ వాటా పెరిగింది. 123 దేశాల్లో మెజారిటీ కమ్యూనిటీ వాటా తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది.
35 అధిక ఆదాయ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) దేశాలు మెజారిటీ మతాల నిష్పత్తిలో 29 శాతం గణనీయమైన సగటు క్షీణతను చూసాయి, ఇది ప్రపంచ సగటు 22 శాతం కన్నా ఎక్కువ. భారతదేశ ధోరణి సమాజంలో వైవిధ్యాన్ని పెంపొందించడాని అనువైన వాతావరణం ఉందని రచయితలు చెప్పారు. మైనారిటీల జీవితాలను మెరుగుపరచడానికి భారతదేశం యొక్క విధానాలు మరియు సంస్థలను అధ్యయనం ప్రశంసించింది. ప్రగతిశీల విధానాలు మరియు సమ్మిళిత సంస్థల ఫలితాలు భారతదేశంలో పెరుగుతున్న మైనారిటీ జనాభాలో ప్రతిబింబిస్తాయి స్టడీ రచయితలు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!