Pakistan-Occupied Kashmir: పీఓకేపై తమ పార్టీ, కేంద్ర ప్రభుత్వం వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో భాగమన్నారు. కాబట్టి, అక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ మా దేశ ప్రజలేనంటూ పేర్కొన్నారు. దేశ విభజన తప్పుగా చేశారు.. పాకిస్థాన్‌లో హిందువులు ఎన్నో అకృత్యాలకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి హిందువుల సంఖ్య 23 శాతం ఉండగా, ఇప్పుడు అది 2.7 శాతానికి పడిపోయిందని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌లో బలవంతపు మత మార్పిడి జరిగింది.. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. ఇలాంటి చిత్రహింసలకు గురైన వ్యక్తులు పాకిస్థాన్‌ను వదిలి భారత్‌కు వచ్చారు.. అలాంటి వారికి మనం ఎందుకు పౌరసత్వం ఇవ్వకూడదు? అని ప్రశ్నించారు. 1950 నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: RCB vs MI: ఎలిమినేటర్‌లో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లోకి బెంగళూరు!
ఇక, బీజేపీ 300 సీట్లకు పైగా గెలుస్తుందని, ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుస్తుందని అమిత్ షా అన్నారు. మాకు 10 ఏళ్ల ట్రాక్ రికార్డ్, 25 ఏళ్ల ఎజెండా ఉంది. గత ఎన్నికల్లో 300 టార్గెట్ పెట్టుకుని 303 సీట్లు తెచ్చుకున్నాం.. ఈ సారి ఎన్డీయే 400కి పైగా సీట్లు గెలుస్తుందని మళ్లీ చెబుతున్నాను.. పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. మేం ఏ పార్టీని విచ్ఛిన్నం చేయలేదన్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి హోంమంత్రి మాట్లాడుతూ.. కూటమి నుంచి మేం బహిష్కరించలేదన్నారు.. అది అతని నిర్ణయం, ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్లి ఓడిపోయారో అప్పుడే అర్థమైంది.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాతో చేరడానికి స్వాగతం పలికామని షా చెప్పుకొచ్చారు.
Read Also: Arvind Kejriwal : నేడు కోర్టుకు హాజరుకానున్న సీఎం కేజ్రీవాల్
అయితే, ఎలక్టోరల్ బాండ్లపై విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా బదులిచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీ లాభపడిందన్న భ్రమను ప్రచారం చేస్తున్నారు.. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని ఆయన అన్నారు. బీజేపీకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు.. అయితే దానికి కేవలం ఆరు వేల కోట్ల విలువైన బాండ్లు వచ్చాయి.. ప్రతిపక్షానికి తక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ, దానికి చాలా రెట్లు ఎక్కువ విలువైన బాండ్లు వచ్చాయని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం వెల్లడిస్తే విపక్షాలకు ఇబ్బంది తప్పదన్నారు. భారత రాజకీయాల్లో నల్లధనాన్ని తొలగించేందుకే ఎన్నికల బాండ్లను ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అందరూ అంగీకరించాల్సిందేనంటూ అమిత్ షా వెల్లడించారు.