ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఈరోజు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెళ్లారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని..…
సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా..?ను అంటూ ఎదురు ప్రశ్నించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారు.. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని, అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని తెలిపారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ అధిష్టానం చేపట్టిన సీట్ల మార్పులు - చేర్పులపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. నాకు టిక్కెట్ వస్తోందో? రాదో? తెలియదు అన్నారు. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన వారి గెలుపు కోసం పనిచేస్తాను అని ప్రకటించారు. ఇక, అధిష్టానం నుంచి నాకు ఎలాంటి పిలుపు అందలేదన్న ఆయన.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కురబ (కురుమ) సామాజిక వర్గం బలంగా ఉందని…